భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ (ఎన్ఐఈ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల వివరాలు చూస్తే ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్, ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ప‌్రాజెక్ట్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ త‌దిత‌ర విభాగాల్లో ఉన్నాయి. అయితే వీటికి ఆసక్తి గల అభ్యర్థులు ఈ -మెయిల్‌ ద్వారా కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరితేది ఆగస్టు 24, 2020. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం http://nie.gov.in/ వెబ్ ‌సైట్‌ ను చూడాలి.
ఇక ఉద్యోగాలకు విద్య అర్హ‌త చూస్తే, పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ లేదా ఎంఎస్ ఉత్తీర్ణ‌తతో పాటు అనుభ‌వం కలిగి ఉండాలి.‌ ఇక వయసు విషయానికి వస్తే పోస్టులను బట్టి మారుతూ ఉంది. ఆగష్టు 1 నాటికి 30 - 40 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత ఉద్యోగాలకు వేతనం చూస్తే రూ.18 వేల నుంచి రూ.64 వేల వరకు వస్తుంది. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫ్ కోసం ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 24, 2020 ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది. దరఖాస్తులు పంపాల్సిన nieprojectcell@nieicmr.org.in ఈ-మెయిల్‌ ఐడీ కి దరఖాస్తులు పంపించాలి.

ఇక ఎవరైతే ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హులో వారు అప్లై చేసుకొని, ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఆల్ డ్ బెస్ట్. భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్ ‌- నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ  చెన్నై నగరం లో మాత్రమే ఈ ఉద్యోగాలకు సంబంధిచి భర్తీ చేయనున్నారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: