17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు..అంటూ అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోది. పార్టీ పరిస్థితి గురించి ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడే అలా మాట్లాడటం టీడీపీ వర్గీయులను కూడా షాక్ కు గురి చేసింది. అయితే.. ఈ వీడియో మరో కీలకమైన అంశం 1200 కోట్ల అంశం. తనకు రావాల్సిన రూ.6 కోట్లు ఇప్పించాలని.. లేకపోతే.. మొత్తం 1200 కోట్లు.. మొత్తం స్మాష్ చేస్తానని టీడీపీ నాయకుడు ఒకరు అచ్చెన్నాయుడితో చెప్పడం కలకలం రేపుతోంది.

ఆ వీడియోలో అచ్చెన్నాయుడితో మాట్లాడింది టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావుగా చెబుతున్నారు. ఇటీవల తిరుపతిలోని ఓ హోటల్‌లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో బహిర్గతమై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసలు డబ్బు ప్రస్తావన ఎందుకు వచ్చింది. డబ్బు గురించి ఆకుల వెంకటేశ్వర రావు అచ్చెన్నాయుడితో ఏమన్నాడో ఓసారి చూద్దాం..

లీకైన వీడియోలో అచ్చెన్నాయుడు, వెంకట్‌ సంభాషణ ఇలా ఉంది.

అచ్చెన్న : నేను కూడా చెబుతా... బాధపడుతున్నాడని!

వెంకట్‌ : చేయరండీ వీళ్లెవరూ... లోకేష్‌ను కాదని వీళ్లెవరూ చేయరు. ఎందుకంటే బాలకృష్ణ ఇంటికెళ్లా. చూసి వెళ్లిపోయాడు. ఫోన్‌ చేసి మెసేజ్‌లు కూడా పెట్టా.

అచ్చెన్న : పెద్ద గందరగోళంగా ఉంది ఇదంతా.. ఏంచేయాలో ఏమీ అర్థం కావడంలేదు పార్టీ పరిస్థితి కూడా...!

వెంకట్‌ : ఇంకేం పార్టీ సర్‌?.. లోకేష్‌గాడు ఉన్నంత వరకూ. బాలకృష్ణకి డైరెక్ట్‌గా చెప్పా నేను. అది ఎంత తప్పండి..? నన్ను సూసైడ్‌ చేసుకోమంటాడా? 30 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని సర్వీస్‌ చేసినందుకు. నా ఫోన్‌ కూడాఎత్తడం మానేశారు. రాజగోపాల్‌కి చేశా. రమేష్‌కి చేశా. ఎవరూ ఎత్తడంలేదు.

అచ్చెన్న : 17 తర్వాత ఫ్రీ అయిపోతాం. ఇక పార్టీ లేదు... బొ. లేదు..!

వెంకట్‌ : అయిపోయింది సర్‌ పార్టీ పని అయిపోయింది.. జీరో అయిపోయింది. మీరు ఏమైనా అనుకోండి.. వెంకట్‌ : మరీ ఇంత అన్యాయమా సర్‌? 30 సంవత్సరాలు సర్వీసు చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు. ఏమన్నా అంటే లోకేష్‌... సూసైడ్‌ చేస్తే చేసుకోండి ఫ్యామిలీ మొత్తం అంటాడు. లోకేష్‌ దగ్గరకు వెళితే కనీసం.. ఇంతకుముందు అన్నా అనేవాడు.. వెళ్లి అక్కడ కూర్చోమ్మా అని అంటున్నాడు. మా ఇంటికి సైకిల్‌ గురించి వచ్చాడు. మరీ అంత అన్యాయమా సర్‌..? ఆడికి ఎంత సర్వీసు చేశా?  నేను పూర్తిగా రోడ్డు మీద పడిపోయా. వాళ్లు నాకేం చేయొద్దు. నాకు రావాల్సిన దాని గురించి ఒక మాట చెబితే 3 కోట్లు ఇస్తారు. మొత్తం 6 కోట్లు అది. ఒక్కమాట..

అచ్చెన్న : ఎవరు అది?

వెంకట్‌ : కేఎల్‌ నారాయణ. ఇంకోమాట చెబుతున్నా... కేఎల్‌ నారాయణ ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. మొత్తం 1,200 కోట్లు అది. మొత్తం స్మాష్‌ చేస్తా.

అచ్చెన్న : చెప్పిద్దాం. సార్‌తో ఒక మాట చెప్పిద్దాం

వెంకట్‌ : ఏం చెబుతాడు సార్‌? ఆరోజు మూడుసార్లు కలిశాను సార్‌.. ఎన్టీఆర్‌ ఘాట్‌లో. నీకెందుకమ్మా నేను చేస్తా అని పెద్దాయన మాటిచ్చాడు. వీడేమో.. లోకేష్‌ గాడు.. వాడిని పలకరిస్తే దొంగోణ్ణి చూసినట్లు చూస్తున్నాడు. మరీ అంత అన్యాయమా సర్‌? వాడికి ఎంత సర్వీసు చేశా?

ఈ సంభాషణలో రూ. 1200 కోట్ల వ్యవహారం ఏంటన్నది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: