హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు రేట్లు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈరోజు ధరల విషయానికొస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కాస్త కిందకు దిగింది. రూ. 10 తగ్గడంతో. రూ.50,060 కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 క్షీణతతో రూ.45,890కు తగ్గింది. వెండి ధర మాత్రం ఈరోజు స్వల్పంగానే తగ్గింది. బంగారం ధరల పై వెండి ధర ఆధారపడి ఉంటుంది.
మార్కెట్ లో గత రెండు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ.200 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.66,600కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే బంగారముతో సమానంగా వెండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.. ఈ వస్తువుల కొనుగోలు పై భారీ డిస్కౌంట్ కూడా ఉండటంతో రేట్లు మరింత కిందకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు రేట్లు చూస్తే..బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలగు అంశాలు ఈ ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని అంటున్నారు. మరి ఎలా ఉంటాయో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి