తెలంగాణ ఉద్యమం : 1969 జనవరి 9వ తేదీన మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది. మొదట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కలిసి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే ఒకసారి తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి లేకుండా చేశారు. దీంతో తమకు అన్యాయం జరిగిందని గ్రహించిన తెలంగాణ ప్రాంత ప్రజలు అసంతృప్తితో 1969 జనవరి 9వ తేదీన ఖమ్మం పట్టణంలో స్టూడెంట్స్ నాయకుడైన రవీంద్రనాథ్ గాంధీచౌక్ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. క్రమక్రమంగా ఉద్యమం నిజామాబాదుకు పాకింది. ఇక ఆ తర్వాత కొన్ని హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్ధి తన దీక్షను విరమించాడు దీంతో తెలంగాణ రక్షణ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రెండవ దశలోకి ప్రవేశించింది ఉద్యమం. 

 

 అంటార్కిటికా : 1982 జనవరి 9వ తేదీన మొదటిసారి భారత శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికా కు చేరింది. అంటార్కిటికా ఖండం 98% మంచు తో కప్పబడి ఉంటుందని విషయం తెలిసిందే. 

 

 ప్రపంచ తెలుగు సమాఖ్య : 2009 జనవరి 9  లో ప్రపంచ తెలుగు సమాఖ్య 8 వ వార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఆనాడు అంగరంగవైభవంగా ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ  సమావేశాలు జరిగాయి. 

 

 

 హరగోవింద్ ఖొరానా జననం : ప్రముఖ జీవశాస్త్ర శాస్త్రజ్ఞుడు హర్ గోవింద్ ఖురానా. భారత సంతతికి చెందిన హర్ గోవింద్ ఖురానా నోబెల్ బహుమతిని పొందారు. జీవ శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను మానవాళికి అందించారు హరగోవింద్ ఖొరానా. ఈయన  1922 జనవరి 9వ తేదీన అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాయపూర్ అనే గ్రామంలో జన్మించారు. 

 

 

 జిమ్మీ ఆడమ్స్ జననం : జిమ్మీ ఆడమ్స్ వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రీడాకారుడు. ఎన్నో సంవత్సరాల పాటు వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించే జట్టుకు విజయాలు అందించారు. జిమ్మీ ఆడమ్స్ 1968 జనవరి 9వ తేదీన జన్మించారు. ఎడమ చేతితో బ్యాటింగ్ మరియు ఎడమ చేతితో బౌలింగ్ చేయగల ఆడమ్స్ మంచి అల్ రౌండర్  కూడా. వెస్టిండీస్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా వ్యవహరించడమే కాకుండా  చాలా సంవత్సరాల వరకు జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టి ఎన్నో  విజయాలను అందించారు  . అంతేకాదు జిమ్మీ ఆడమ్స్ అవసరమైనప్పుడు వికెట్ కీపర్ గా   కూడా చేసేవాడు .

 

 దేవేంద్ర హార్నే  : 1995 జనవరి 9వ తేదీన జన్మించారు. 12 చేతివేళ్లతో 13 కాళీ వేళ్ళతో  ఇండియా లో జన్మించారు దేవేంద్ర.

 

 ప్రవాస భారతీయ దివాస్ : 1915 జనవరి 9వ తేదీన మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్ కు  తిరిగివచ్చిన ఈ తేదీని... ప్రవాస భారతీయ దివస్ గా 2003 నుంచి ప్రభుత్వం జరుపుకుంటోంది దేశం .

మరింత సమాచారం తెలుసుకోండి: