ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్యలలో ఒకటి మోకాళ్ల నొప్పులు. ఇది ఒబిసిటీ వలనే కాదు సన్నటి వాళ్ళు కూడా మోకాళ్ల నొప్పులతో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకొస్తున్నాయో మీకు తెలుసా. మనకి ఎక్కడైతే నొప్పులుగా ఉన్నాయో  అక్కడ మనకు ఆక్సిజన్ తగ్గుతుందని అర్ధం. ఆక్సిజన్ ని పెంచే  ఆయుర్వేద విధానం ఏంటంటే ఆవు నెయ్యిని  గోరువెచ్చగా చేసి ముక్కుల్లో వేసుకోవాలి.



ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ బాగా పెరుగుతుంది, అలాగే ఆహార విధానంలోనూ డైజెషన్ క్రియ సరిగా లేకపోయినా సరే ఎక్కువ నొప్పులు వస్తాయి.దీనికి చక్కటి పరిష్కారం ఏమిటంటే  కలబంద గుజ్జును వేడి చేసి అందులో కొద్దిగ మిరియాల పొడి మరియు పటిక బెల్లం పొడి వేసి బాగా కలుపుకుని తింటే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే జిల్లేడు ఆకులకు కొంచెం ఆముదం రాసి, లేదా నువ్వుల నూనె రాసి, వేడి చేసి మోకాళ్లపైన, మోకాళ్ల కింద కండరాలకు కట్టాలి.



ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు  తగ్గిపోతాయి. ఆవాలను మెత్తగా నూరి, పొడి చేసి అందులో కొద్దిగ నీళ్ళు పోసి గుజ్జుగా చేసుకోవాలి.ఇలా చేసిన గుజ్జును ఒక క్లాత్ కి రాసి దానిని మోకాల పైన పూర్తిగా కప్పేలాగా చుట్టుకొని ఒక 15 లేదా 20 నిముషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి.



మినప్పప్పు పాయసం తాగుతా ఉంటే ఎక్కడ ఎంతటి నొప్పి అయినా సరే సులువుగా తగ్గిపోతుంది. నడవటం నొప్పి ఉందని పడుకుంటే నొప్పులు పెరుగుతూనే ఉంటాయి. అందుకే మనం కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుంటే ఎక్కడా కూడా నొప్పులు ఉండవు. మోకాళ్ల నొప్పులే కాదు అసలు ఏ నొప్పులు ఉండవు. అందుకే తిరుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: