మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది. మన వంటింట్లో వుండే పదార్ధాల తోనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. మన వంటింట్లో దొరికే మెంతులతో మనకు అనేక రకాల ప్రయోజనాలు వున్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి. ఎన్నో రోగాలతో పోరాడగలిగే శక్తి మెంతులకు ఉంటుంది. అందుకే మన పూర్వికులు ప్రతి వంటకంలో మెంతులను వాడేవారు. మెంతులను ఎక్కువగా ఊరగాయలు, పులుసు, పోపుల్లో వాడుతుంటారు. ఇటీవల వీటి వాడకం బాగా తగ్గిపోయింది. అవి ఉన్నా.. లేకపోయినా పర్వాలేదనే భావనలో ప్రజలు ఉన్నారు. మెంతులను పొడి చేసుకుని తిన్నా లేదా నీటిలో నానబెట్టి తాగినా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

చాలా మంది డయాబెటిస్ (మధుమేహం)తో బాధ పడుతూ ఉంటారు. డయాబెటిస్ చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితంలో పోదు. కాబట్టి డయబెటీస్ తో బాధపడేవారు రోజూ మెంతుల నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జుట్టు సమస్యలతో బాధపడేవారికి  మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులు జుట్టు రాలే సమస్యను అరికడుతాయి. రంగు కూడా నెరవకుండా కాపాడతాయి. జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు మెంతుల పొడి, పెరుగు కలిపి నానబెట్టి జుట్టు రాసి, మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం మంచిది.

మెంతులను నానబెట్టిన నీరు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. మెంతుల నీటిని తాగితే మలబద్ధకం, జీర్ణసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది.మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది.మెంతుల్లో శరీరానికి మేలు చేసే ఇనుము, పీచు పదార్థాలు, విటమిన్ C, B1, B2, కాల్షియంలు సమృద్ధిగా ఉన్నాయి.ఈ విధంగా మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: