సాధారణంగా బాదంపప్పులు నానబెట్టుకుని తింటూ ఉంటాము. ఇది ఏంటి విడ్డూరంగా నానబెట్టిన వేరుశనగలు తినాలని అంటున్నారు.ఇన్ని రోజులూ   నానబెట్టిన బాదంపప్పులు గురించి చెప్పి,ఇప్పుడు వేరుశెనగలు గురించి చెప్తున్నారు ఏంటి? అనే సందేహం మీలో కలుగుతొందా? నిజమండీ బాదంపప్పులను నీటిలో నానబెట్టి తినే ఫలితాలు, ఇప్పుడు వేరుశనగలో కూడా అంతకు మించి ఫలితాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెట్టిన వేరుశనగలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

సాధారణంగా వేయించుకొని, ఉడకబెట్టుకొని, ఎన్నో రకాల పొడులు, కూరలలోను వాడుతుంటారు. కొంతమంది ఎక్కువగా పచ్చి విత్తనాలు తినడానికి ఇష్టపడుతుంటారు. వేరుశెనగలలో ఎక్కువగా విటమిన్ ఇ, సెలీనియం,జింకు,ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా శరీర చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. శరీరంలో రక్తప్రసరణను పెంచి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

మనలో చాలా మంది వేరుశెనగలను  పొట్టుతీసి తింటుంటారు.కానీ వేరుశనగ పొట్టులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని, రీసెంట్ గా జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.అయితే ఈ వేరుశనగ విత్తనాలను ఎలా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

ఇందుకోసం ప్రతి రోజూ  రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు విత్తనాలను తీసుకొని, ఒక గిన్నెలో వేసి ఇవి మునిగే వరకు నీళ్ళు పోయాలి. అలా రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీయకుండా తినాలి. ఈ విధంగా రాత్రి మొత్తం నానబెట్టిన వేరుశనగ విత్తనాలను పొట్టు తీయకుండా ఉదయాన్నే అల్పాహారంలో తీసుకోవడం వల్ల వీటిలో  ఉండే ప్రోటీన్లు అధిక శాతంలో శరీరానికి అందుతాయి. కాబట్టి బాడీ మజిల్ బిల్డింగ్ చేయాలంటే వేరుశనగ విత్తనాలను పొట్టుతో సహా తినేయాలి. అంతేకాకుండా ఈ తొక్కలో ఉండే బయో యాక్టివ్స్, ఫైబర్లు మన శరీరం వ్యాధులకు గురి కాకుండా చేస్తాయి.

ముఖ్యంగా ఇందులో ఉండే పాలీఫినాల్స్ మన శరీరంలో కలిసిపోయి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.  దానితోపాటు చర్మాన్ని డీహైడ్రేట్ కు గురికాకుండా,తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ వేరుశనగలు తినడం వల్ల, క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే బ్లూ బెర్రీస్ లో ఉండే పోషకాలు కన్నా వేరుశనగ పొట్టులో పోషకాలు అధికంగా ఉన్నాయి. మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ను ఎదుర్కొనే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ వేరుశనగ విత్తనాలను పొట్టుతో సహా తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి సన్నగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విటమిన్-సి, గ్రీన్ టీల ద్వారా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఇలా నానబెట్టిన వేరుశనగ విత్తనాల తొక్క లోనే అధికంగా ఉన్నాయి. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచి రోగాలు దరిచేరకుండా చేస్తాయి. ద్రాక్ష పండు వైన్ లో అధికంగా డిజర్వేట్రాల్ అనే పదార్థం ఉంటుంది.  అదే పదార్థం వేరుశనగ తొక్కలో కూడా అధికంగా ఉంటుందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది.ఇది మనలో కోపాన్ని తగ్గించి, సహనాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో మంట, వాపు,దురదలను  కూడా తగ్గించి వేస్తుంది. కాబట్టి నిత్యం ఇలా ఉడకబెట్టిన,నానబెట్టిన,వేయించిన వేరుశెనగ విత్తనాలు తీసుకునేటప్పుడు తొక్కుతో సహా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: