టీ లేదా వార్మ్ లెమన్ వాటర్ లో తేనెను కలుపుకుని తాగితే గొంతునొప్పి సమస్య తగ్గుతుంది. తేనెలో దగ్గు తగ్గించే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఒకానొక స్టడీలో ఒకటి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తేనె రెమెడీతో తగ్గుతాయని తేలింది.

రెండు టీస్పూన్ల తేనెను బెడ్ టైమ్ సమయంలో పిల్లలకి ఇస్తే మంచి రిలీఫ్ కలుగుతుందని ఆరోగ్య నిపుణుల సలహా. ఇది రాత్రిపూట దగ్గును తగ్గిస్తుంది. అలాగే, నిద్ర క్వాలిటీను మెరుగుపరుస్తుంది.

నిజానికి, ఒకానొక స్టడీలో తేనె అనేది దగ్గును తగ్గించేందుకు హెల్ప్ చేసే ఓవర్ ది కౌంటర్ డోసెస్ తో సమానంగా పనిచేస్తుందని తేలింది. తేనె అనేది అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి, సాధారణ దగ్గుకు దీన్ని రెమెడీగా వాడటం మంచిదే అనంటున్నారు  ఎక్స్పర్ట్స్.

ఇంకొకవిషయం ఏంటంటే, దగ్గు కూడా మంచిదేనట. ఇది ఎయిర్ వేలోనున్న మ్యూకస్ ను తొలగిస్తుంది. హెల్తీగా ఉన్నప్పుడు దగ్గును సప్రెస్ చేయడం అవసరం లేదు. విపరీతంగా దగ్గు వేధిస్తున్నప్పుడు మెడికేషన్ గురించి తప్పక ఆలోచించాలి.

నిమ్మరసంలో కలిపిన తేనె అనేది కంజెషన్ ను తగ్గిస్తుంది. బ్రెడ్ పై తేనెను స్ప్రెడ్ చేసి తీసుకున్నా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. స్పూనుడు తేనెను తీసుకున్న పర్లేదంటున్నారు. ఇది దగ్గుకు నేచురల్ రెమెడీగా ప్రాచుర్యం పొందింది.

తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్ అలాగే  యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ కూడా కలవు. ఇవి సాధారణ జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తేనె వల్ల గొంతులో కిచ్ కిచ్ సహజంగానే తగ్గుతుంది. అలాగే, కామన్ కోల్డ్ నుంచి రిలాక్సేషన్ అందుతుంది.

జలుబుకు సంబంధించిన లక్షణాలు కనిపించగానే హనీ రెమెడీని పాటిస్తే రిజల్ట్స్ చూసి మీరు షాకవుతారు. తేనె వల్ల కలిగే బెనిఫిట్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

ఐతే, ఏడాదిలోపు పిల్లలకు తేనెను ఇవ్వకూడదని గమనించాలి. ఏడాదిలోపు పిల్లలకు తేనెను ఇవ్వడం వల్ల వారికి అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: