ప్రపంచవ్యాప్తంగా అందమైన పొడవాటి, మందపాటి జుట్టును మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. పొడవాటి జుట్టు అందానికి సంకేతం అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ పొడవాటి జుట్టు లేకుండా, ఒత్తైన ఆరోగ్యకరమైన జుట్టుకు కలిగి ఉండటం వల్ల కూడా అందం పెరుగుతుందని చెప్పవచ్చు. మగ లేదా ఆడవారైనా జుట్టు వారి శారీరక రూపాన్ని మరియు అందాన్నిపెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యకరమైన జుట్టు ఉన్నవారు కూడా అందంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు ఇప్పటికే అందమైన లేదా ఒత్తైన జుట్టు కలిగి ఉన్నా, మరియు అందమైన జుట్టును లేని వారు మీ జుట్టుకు ఏమి అవసరమో మీరు గ్రహించాలి. అలాగే ఒత్తిడి ఆందోళన మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా అనేక కారణాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీని వలన వెంట్రుకలు రాలిపోవడం జుట్టు పెరుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే వెంట్రుకలు దృఢంగా ఉండడానికి ఏ సమస్యలు రాకుండా ఉండటానికి 10 రకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగపడతాయి. అయితే అవి ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం...




 ఆలివ్ ఆయిల్ తో జుట్టు మృదువుగా మారుతుంది. అలాగే కాంతివంతంగా తయారవుతుంది. ఎండ నుంచి వెంట్రుకలను రక్షిస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్రేప్ సీడ్ ఆయిల్ ఉష్ణ ప్రదేశాలలో గడిపే వారి జుట్టుకు ఈ గ్రేప్ సీడ్ ఆయిల్ వల్ల రక్షణ లభిస్తుంది. అలాగే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు. ఆమ్లా ఆయిల్ఆయిల్ వలన వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి అంతేకాకుండా జుట్టు నల్లగా కూడా మారుతుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.



 ఆముదం నూనె ఈ నూనెతో జుట్టు పెరుగుదల సరిగ్గా ఉంటుంది. అంతేకాకుండా వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది. వెంట్రుకలు ఉండే ప్రాంతంలో రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. ఈ ఆముదం నూనెను వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్యలను తగ్గించుకోవచ్చు. జొజొబా ఆయిల్ఆయిల్ తో దురద తగ్గుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు దృఢంగా కూడా మారుతుంది.



 కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె కు ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. చాలామంది జుట్టు సంరక్షణ కోసం తరచూ కొబ్బరి నూనెను జుట్టుకు వాడుతుంటారు. ఈ కొబ్బరి నూనె జుట్టుకు తగిన బలాన్ని ఇస్తుంది. అలాగే కొబ్బరి నూనెతో అనేక జుట్టు సమస్యలను నివారించవచ్చు. కొబ్బరి నూనెతో శిరోజాలు పెరుగుతాయి. చుండ్రు సమస్య కూడా ఉండదు. అలాగే జుట్టు కుదుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.


 మకడేమియా ఆయిల్ వల్ల వెంట్రుకలకు ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే శిరోజాలు దెబ్బతినకుండా ఉంటాయి. వెంట్రుకలు చిట్లడం కూడా తగ్గుతుంది. జుట్టు మృదువుగా కూడా మారుతుంది. ఆర్గాన్ ఆయిల్ వల్ల శిరోజాలు దృఢంగా  మారడంతో పాటు కాంతివంతంగా కూడా  ఉంటాయి. అవకాడో ఆయిల్ వల్ల దెబ్బతిన్న జుట్టు మరమత్తు అవుతుంది చుండ్రు సమస్య ఉండదు జుట్టు పట్టులా మారుతుంది. ఆల్మండ్ ఆయిల్ వలన ఎండ నుంచి జుట్టుకు రక్షణ లభిస్తుంది. అలాగే జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు చిట్లడం కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: