మగవారు వీర్యకణ వృద్ధికి కొన్నిరకాలైన ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే తమ వీర్యకణ వృద్ధి తగ్గి సంతాన సాఫల్యత రేటు తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పిల్లలు కావాలని అని ప్లాన్ చేసుకునే మగవారు.. తమ డైట్ విషయంలో తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి.సంతానసమస్యలు అంటే కేవలం ఆడవారికే కాదు,మగవారికి కూడా ఉంటాయి.

వీర్యకణవృద్ధికి మగవారికి రకరకాల మందులను వైద్యనిపుణులు సూచిస్తారు. కానీ లైంగికశక్తిని స్వతాహాగా పెంచుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ ఆ ఆహారలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1).వేయించిన ఆహారాలు..
ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.వీటిలో సెమీ-ఘన ఆహార ఉత్పత్తిని సృష్టించడానికి కూరగాయల నూనెకు హైడ్రోజన్ అణువులను కలుపుతారు. ఇందులో వేయించిన ఏ ఆహారమైన తింటే వీర్యకణ వృద్ధి తగ్గిపోతుంది.

2).సోయా ఉత్పత్తులు
సోయాను ప్రోటీన్ పుడ్ గా తీసుకుంటున్నప్పటికీ,వీటిని ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలు కావాలని ప్రయత్నించేవారు, వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు స్పెర్మ్ నాణ్యత, కౌంట్ ను ప్రభావితం చేస్తాయి.

3).కార్బోనేటేడ్ పానీయాలు
కోలాస్, ఎనర్జీ డ్రింక్స్ వంటి కారబోనేటెడ్ డ్రింక్స్ పురుషులలో సంతానోత్పత్తి దెబ్బతిస్తాయి.అవి స్పెర్మ్ చలనశీలతను ప్రభావితం చేస్తాయి.
 
4).కొవ్వు తీయని పాలఉత్పత్తులు
పాల ఉత్పత్తులు సాధారణంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ జున్ను, ఫుల్-క్రీమ్ మిల్క్ వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులు వీర్యకణ కదలికను , స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గిస్తాయి.


5).ప్రాసెస్ చేసిన మాంసం
ప్రాసెస్ చేసిన మాంసాలను అధికంగా తీసుకోవడం వల్ల అండం ఫలదీకరణం చేసే స్పెర్మ్ సామర్థ్యాన్ని తగ్గించే గుణం వీటికి ఉంటుంది. సేంద్రీయ మాంసం పర్వాలేదు. కానీ.. హాట్ డాగ్‌లు, సలామీ, బేకన్ మొదలైన ప్రాసెస్ చేసిన మాంసం వీర్యకణ వృద్దిని అడ్డుకుంటాయి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకొనే మగవారిలో దాదాపు 50% విభిన్న ఆకారపు స్పెర్మ్‌ను కలిగి ఉంటారని వైద్య నిపుణులు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: