
తగినంత నీరు తీసుకోకపోవడం..
మన శరీరానికిఆహారంతో పాటు,నీరు కూడా చాలా అవసరం.కానీ ఈ మధ్యకాలంలో నీరు అధికంగా తాగితే ఎక్కువ సార్లు యూరిన్ వెళ్లాల్సి వస్తుందని చాలా మంది తక్కువగా తీసుకుంటూ ఉంటారు.అలాంటి వారిలో కచ్చితంగా కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.తగినంత నీరు తీసుకోవడం వల్ల,శరీరంలోని టాక్సిన్స్ విసర్జనను నియంత్రిస్తుంది.దీనితో మన శరీరంలోని వ్యర్థము అంతా యూరిన్ మరియు మలం రూపంలో బయటికి వెళ్లిపోతుంది.
మాటిమాటికి తింటూనే ఉండడం..
చాలామంది టీవీ చూస్తున్న మొబైల్ చూస్తూనే ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారు.వారికి ఏం తిన్నాము,ఎంత తిన్నామోనే అవగాహన లేకుండా తినడం వల్ల అందులోని ఉప్పు,ఐరన్,కారం,చెడు కొలెస్ట్రాల్ అధికంగా శరీరానికి అంది కిడ్నీ పనితీరును మందగించేలా చేస్తాయి.అంతేకాక కాఫీ,ఆల్కహాల్ అధిక ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రమాదకరం.ఎక్కువగా ప్రోటీన్ మరియు కొవ్వులను వడపోయడానికి కిడ్నీ అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది.దానితో మూత్రపిండాలు దెబ్బతింటాయి.కావున ఆహార నియమాలు పాటిస్తూ సరైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
మద్యపానం..
అధికంగా మద్యం తీసుకోవడం,సిగరెట్,బీడీ తాగడం,హుక్కా తాగడం టీవీ కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.ఈ చెడు అలవాట్లను తొందరగా మానేయకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు,క్యాన్సర్తో పాటు ఇతర రోగాలు చుట్టుముడతాయి.కిడ్నీ ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు అధికంగా ఫైబర్ ఉన్న ఆకుకూరలు,పండ్లు,చేపలు,మాంసము వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.మరియు రోజు అరగంటసేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం.