సాధారణంగా ప్రతి ఒక్కరు పచ్చి కొబ్బరి నీళ్లు,పచ్చి కొబ్బరి ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.కానీ ఎండు కొబ్బరి తినడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు.ఎండుకొబ్బరిని ఎక్కువగా వంటకాల్లో మాత్రమే వాడుతూ ఉంటారు.కానీ ఎండుకొబ్బరిని రోజు పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆహార నిబంధనలు చెబుతున్నారు.వాటి వల్ల దీర్ఘకాలిక రోగాలను కూడా దరిచేరకుండా కాపాడుకోవచ్చు అని సూచిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎండుకొబ్బరి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి..

 ఎండుకొబ్బరిలోని పోషకాలు..

ఎండుకొబ్బరిలో కాల్షియం,శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్,మెగ్నీషియం,ఐరన్,విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి.మరియు ఇందులో అధిక ఫైబర్ వల్ల మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడి,జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.


ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల,రోజు పరగడుపున ఎండుకొబ్బరిని తినడంతో దీర్ఘకాళిక వ్యాధి అయిన క్యాన్సర్ ను కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.దాని ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది.అందువల్ల క్యాన్సర్ దరిచేరకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు.ముఖ్యంగా స్త్రీలు బ్రెస్ట్ మరియు గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.కావున ప్రతి ఒక్కరూ రోజు పరగడుపున ఒక చిన్న ముక్క ఎండుకొబ్బరి తీసుకోవడం చాలా ఉత్తమం.

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బరువు పెరిగి తెగ ఇబ్బంది పడుతుంటారు.ఇలా బాధపడుతుంటే వారికి ఎండు కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుంది.రోజూ పరగడుపున ఎండు కొబ్బరి తినడం వల్ల,ఇందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి అధిక బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.

రక్త హీనతతో బాధపడుతుంటే, అలాంటి వారికీ పరగడుపునే ఎండు కొబ్బరి తింటే రక్తహీనత తగ్గుతుంది.ఇందులోని ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్‌ లెవెల్స్ కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది.ఎండు కొబ్బరికాయలు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.అవి అందించే పోషకాలు అధిక బిపిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి.

ఋతుక్రమణ సమస్యలతో బాధపడేవారికి ఎండు కొబ్బరి చాలా బాగా సహాయపడుతుంది.ఇందులోని మెగ్నీషియం ఆ సమయంలో వచ్చే నడుము నొప్పులు, పొట్టనొప్పి,అధిక స్ట్రావం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: