దేశంలో మళ్ళీ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేవలం భారత్ లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే భారత్ లో 257పైగా యాక్టివ్ కేసులో నమోదయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. దేశంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళలోనే నమోదు కావడం ఆశ్చర్యకరం. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయ్యింది. ఇక కరోనాలో అనేక వేరియంట్లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జరిపిన పరీక్షల్లో కొత్త వేరియంట్లు బయటపడ్డాయి.

జేఎన్ 1 ఉపకారకాలు అయిన ఎన్ బీ 1.8.1 వేరియంట్లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ బీ 1.8.1ను ఏప్రిల్ లో గుర్తించగా.. ఎల్ ఎఫ్ 7కు సంబంధించిన కేసులు మే నెలలో గుర్తించారు. ఈ వేరియంట్ కేసులు గుజరాత్ తమిళనాడులో నమోదైనట్టు తెలుస్తోంది. అయితే గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఇవి అంత ప్రమాదకరం కాదని అధికారులు చెబుతున్నారు. శరీరంలోని కొన్ని ప్రోటీన్లకు ఇవి బలంగా అనుసంధానం అవుతున్న కారణంగా వేగంగా వ్యాపిస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన వేరియంట్లు ప్రమాదకరం కాకపోయినప్పటికీ వైరస్ ఎంత ప్రమాదకరమైందో తెలిసిందే. కాబట్టి కొత్త వేరియంట్ లు కూడా పుట్టుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచిస్తుంది. ఇక ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా లక్షణాలు చూసినట్లయితే.. తాజా వేరియంట్ లు ఎక్కువగా గొంతు పై ప్రభావం చూపిస్తున్నాయి. దీని కారణంగా ఎక్కువగా పొడి దగ్గుతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా జ్వరం, ముక్కు కారడం లాంటి లక్షణాలు సైతం కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్స్ సోకిన వారికి నోట్లో కురుపులు రావడంతో పాటు రుచిని కోల్పోతున్నారు. అంతేకాకుండా కొందరు డయేరియా బారిన సైతం పడుతున్నారు. కాబట్టి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: