రక్తహీనత అనేది చాలా సాధారణమైన ఆరోగ్య సమస్య. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయినప్పుడు లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. దీని వల్ల శరీరంలోని కణాలకు తగినంత ఆక్సిజన్ అందక నీరసం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

ముందుగా, మీ ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. పాలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకు కూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, అంజీర్ వంటి పండ్లు కూడా హిమోగ్లోబిన్ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

అలాగే, ఐరన్‌తో పాటు విటమిన్ సి కూడా చాలా అవసరం. విటమిన్ సి ఉన్న పదార్థాలు తినడం వల్ల శరీరం ఐరన్‌ను సులభంగా గ్రహిస్తుంది. నిమ్మ, ఉసిరి, జామకాయ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. అలాగే, నట్స్, గింజలు కూడా రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలు, నువ్వులు, బాదం పప్పు వంటి వాటిలో ఐరన్, ఇతర పోషకాలు ఉంటాయి.

రక్తహీనతను తగ్గించుకోవాలంటే కేవలం ఆహారం ఒక్కటే కాదు, సరిపడా నీరు తాగడం, సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం కూడా ముఖ్యమే. రోజూ కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే, రోజూ కాస్త వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: