
అందుకే మన డైలీ డైట్‌ను ఆరోగ్యకరంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గుండె జబ్బులను పెంచే అల్పాహారాలను దూరంగా ఉంచడం అవసరం. ఇండియన్స్‌లో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌కి పూరీ లాంటి హెవీ ఆయిల్ ఫుడ్స్ తింటారు. దీని వల్ల గుండె సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ స్టడీస్ ప్రకారం గుండె జబ్బులను పెంచే టాప్ 3 బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ ఇవి:
1. పూరీ
ఇండియన్ మెనూలో పూరీ అందరికీ చాలా ఇష్టం. ఎంత డైట్‌లో ఉన్నా, స్టార్ సెలబ్రిటీస్ అయినా పూరీ కనిపిస్తే నోరూరిపోతుంది. పిల్లలు కూడా టేస్టీగా ఉందని ఎక్కువగా తింటారు. కానీ పూరీ డీప్ ఫ్రై చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
2. మసాలా దోశ
బంగాళదుంప ఎక్కువగా వేసి, నూనెతో ఎర్రగా, క్రిస్పీగా చేసే మసాలా దోశ చూడగానే టెంప్ట్ చేస్తుంది. కొందరు దానిలో చీజ్ కూడా యాడ్ చేస్తారు. దీంతో కొలెస్ట్రాల్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే ఇంత హెవీ ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం.
3. టీ – బిస్కెట్ – బ్రెడ్ జామ్
భారతదేశంలో చాలా మంది రోజు మొదలు పెట్టేది ఒక టీ కప్పుతోనే. కొందరు పళ్లను కూడా తోముకోకుండా టీ తాగేస్తారు. ఇంకొందరు రోజుకు 10–14 సార్లు కూడా టీ తాగుతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. బ్రెడ్ జామ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మైదాతో చేసిన బ్రెడ్, పామ్ ఆయిల్ వాడకం వల్ల గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
అయితే ఏమి తినాలి?
మిల్లెట్స్, మల్టీగ్రేన్ దాల్ కిచిడి, తక్కువ నూనెతో ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌లు, స్ప్రౌట్స్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, కొవ్వు సమతుల్యంగా ఉండే ఆహారం ఆరోగ్యానికి మంచిది. ఇడ్లీ, వెజిటేబుల్ దలియా, వెజిటేబుల్ ఓట్స్, వెజిటేబుల్ పోహా వంటివి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి రుచికరంగానే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొందరు నిపుణుల సలహాల ఆధారంగా మాత్రమే. దీనిని ఎంతవరకు పాటించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.