జనపనార విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఎముకలలో గుజ్జు పెరగడానికి, ఎముకలు పటిష్టంగా తయారవుతావడనికి, ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఇంకా ఎముక సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుపడుతుంది. జనపనార లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది. జనపనార లో కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఇంకా ఇది సోడియం కలిగి ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన త్వరగా ఆకలి అనిపించదు చిరుతిళ్ల జోలికి వెళ్ళరు. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. థైరాయిడ్ గ్రంథి, క్లోమ గ్రంథి లను క్రమబద్దికరించెందుకు ఉపయోగపడతాయి. జనపనార విత్తనాలను ప్రతి రోజు తీసుకోవడం వలన పెద్ద ప్రేగు క్యాన్సర్ ను తగ్గించడానికి సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీనిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యకు శాశ్వత పరిష్కారం గా చెప్పవచ్చు. పొటాషియం లో ఉండే సరటోనిన్ తలనొప్పి, పార్శ్వనొప్పి, మైగ్రేన్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని వలన చక్కటి నిద్ర పడుతుంది.వీటిని తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి, మెనోపాజ్, డిప్రెషన్ వంటి సమస్యలను నివారిస్తుంది.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉండే జనపనార విత్తనాలు తినడం వల్ల ఆడవాళ్లలో నెలసరికి ముందు వచ్చే కడుపునొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసం లాంటివి తగ్గుతాయి.


దీని వల్ల ఆడవారి నెలసరికి ముందు వచ్చే కడుపు నొప్పి, అలసట, నీరసం దరిచేరవు. జనపనార విత్తనాల్లో గామా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆడవారిలో నెలసరి సమయంలో సున్నితత్వాన్ని పెంచే హార్మోన్ ను తగ్గిస్తుంది. మగవాళ్లకు కూడా జనపనార విత్తనాలు మేలు చేస్తాయి. వీటిని రోజూ గుప్పెడు తినడం వల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే వీర్య కణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.ఇది ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులకు చెక్ పెడుతుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది చక్కటి పోషకాహారం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె పోటు, హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచటంతోపాటు జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ప్రోటీన్ పౌడర్‌కు బదులుగా జనపనార విత్తనాలను వినియోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: