కొబ్బరి చట్నీ... పచ్చి కొబ్బరితో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. నిజానికి ఈ పచ్చి కొబ్బరి వల్ల ఎన్నో ఆరోగ్యా లాభాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఈ కొబ్బరి చట్నీ ఎంతో సహాయం చేస్తుంది. అయితే ఈ కొబ్బరితో పప్పు అని, కొబ్బరి పాలు అని ఇలా ఎన్నో రకాల వంటకాలను చేసుకుంటూ ఉంటాము.                               

                                   

అయితే ఈ కొబ్బరితో చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈ చట్నీ రోటిలో దంచుతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రోటి పచ్చడి ఎంతో రుచిగా నోరూరిస్తూ ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ పెరిగిన కాలంలో రోటి పచ్చడి తినే అవకాశం ఉండదు కాబట్టి ఆ రోజు ఇప్పుడు మిక్సీలో వేసి చేసిన ఎలా వస్తుందో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు : 

 

కొబ్బరి కాయలు-5, 


పాలు-అర లీటరు, 


ఉప్పు-తగినంత, 


పంచదార-తగినంత

 

తయారీ విధానం.. 

 

కొబ్బరి కాయలు పగలగొట్టి కొబ్బరి చిప్పలను బయటికి తీసి అందులో కొబ్బరిని తురిమి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో పాలు, ఉప్పు, పంచదార జత చేసి ఆ మొత్తాన్ని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే కొబ్బరి చట్నీ తయారవుతుంది. ఈ కొబ్బరి చట్నీని అన్నంలో కానీ రాగి సంగటిలో కానీ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చూశారుగా ఎలా చెయ్యాలో.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేసుకొని తినండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: