ఉల్లిపాయలు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే.. అందుకే తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుందని అంటారు.. ఇకపోతే  ఉల్లి కూరలకు రారాజు  అంటారు.. అందుకే ఈ ఉల్లిని ప్రతి కూరలో వాడుతారు.ఈ ఘాటైన ఉల్లిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా చాలా మేలు చేస్తుందట.. అదేలానో ఇప్పుడు చూద్దాం.. మాములుగా ఆరోగ్యానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తాం .. కానీ అన్నిటికన్నా ముఖ్యమైంది మాత్రం ఉల్లి అని నిపుణులు తాజాగా వెల్లడించారు. ఉల్లితో అందమైన ఆరోగ్యం ఉందని అంటున్నారు. మరి ఎలానో ఇప్పుడు చూద్దాం..


ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్ అలిసిన్ అనేది ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, ఆనియన్ జ్యూస్ అనేది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కార్డియో వాస్క్యులార్ రిస్కులను తగ్గిస్తుంది.. యూరినరీ డిజాస్టర్ ను తగ్గిస్తుంది. అంతేకాదు సల్ఫర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, విటమిన్ ఏ, బీ, సి మరియు ఈ అలాగే శక్తివంతమైన క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఎన్నో ఇతర ఫ్లెవనాయిడ్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.


ఈ ఉల్లితో ఒత్తైన జుట్టు ఎలా పెంచుకోవచ్చు నో ఇప్పుడు చూద్దాం..


హైర్ కోసం ఉల్లి జ్యూస్ ను ఎలా తయారు చేసుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఉల్లిని తీసుకొని తొక్క తీసి జ్యూస్ చేసుకోవాలి.. ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఐదు నిమిషాలు పాటుగా నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి..ఎలా జ్యూస్ ను మొత్తాన్ని జుట్టుకు రాసి ఒక 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగి , మైల్డ్ షాంపు తో కడిగేసుకోవాలి అంతే .. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు సమస్యలు పూర్తిగా తొలగి పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మీకు ఈ టిప్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: