మనుషులకు వయస్సు పెరిగే కొద్దీ కొత్త కొత్త మార్పులు వస్తాయి. శరీరాకృతిలో మార్పులు కూడా వస్తాయి. ఇది అక్షర సత్యం.. అయితే ఇప్పుడు తింటున్న అరకొర తిండికి జనాలకు అనేక రోగాలు కూడా వస్తాయి.. ముఖ్యంగా బుద్ధి మందగించడం.. అదేనండి మతిమరుపు.. ఈ సమస్య ఈ అందరిని భాదిస్తుంది. అయితే డాక్టర్లు కూడా ఈ సమస్యలను ఏం చేయలేక పోతున్నారు. మంచి పౌష్ఠిక ఆహరం తప్ప మరేమి లేదు. మతి మరుపును దూరం చేసే వాటిలో ఒకటి రొయ్యలు...

రొయ్యలు ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. మాంసాహారాలలో శ్రేష్టమైన ఆహారం అని చెప్పాలి. రొయ్యల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు రొయ్యలను తినడం ద్వారా బరువు సులువుగా తగ్గించుకోవచ్చు. చికెన్,మటన్ లతో పోలిస్తే కొవ్వు శాతం చాలా తక్కువ. ఖనిజాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. అంతే ప్రమాణం లో ప్రోటీన్లను కూడా కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మాములుగా చేపలకన్నా కూడా రొయ్యల రుచి బాగా ఉంటుంది. అయితే రుచి కోసం అని నూనెలు ఎక్కువగా వాడి ఫ్రై లు చేసుకోవడం కన్నా పులుసు లాగా చేసుకొని తినవచ్చునని అంటున్నారు. రొయ్యలకన్నా మించిన ఆరోగ్యకరమైన ఆహరం మరొకటి లేదని అంటున్నారు. వీటిలో ఏంథి బలం ఉంటుందట. చేపల కన్నా త్వరగా అరిగిపోతాయి. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతి పెరిగేందుకు దోహద పడతాయి. వీటిలో బి 12 విటమిన్ అధికంగా ఉంటుంది. దాంతో అంత సులువుగా మతి మరుపు రాదట. ఇకపోతే శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి కావలసిన శక్తీ ఈ రొయ్యల్లో పుష్కలంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ రొయ్యలు ఆరోగ్యానికి పుట్టినిల్లు అంటున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచి రొయ్యలను తినడం అలవాటు చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: