చిన్నపిల్లల ఆరోగ్యాన్ని మనం చక్కగా చూసుకున్నట్లయితే వారి శరీరంలో అవయవాల ఎదుగుదల అంత బాగుంటుంది. అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి కావాల్సిన అన్ని పోషకాలను అందే విధంగా మనం ఆహారం అందించాల్సి ఉంటుంది. ఇకపోతే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా పాలను ఇస్తూ ఉంటారు. అయితే పాల కంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీ పిల్లలకు మరింత శక్తిని అందించడమే కాదు వారు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. మరి పిల్లలు ఎలాంటి డ్రింక్ తాగాలి? వారికి ఆ డ్రింక్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి? అనే విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం.


ఇకపోతే డ్రింక్ తయారీ కోసం ఒక గిన్నెలో కొన్ని నల్ల ఎండ్ ద్రాక్షలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు , ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు తీసుకొని అన్ని మిక్స్ చేసి నైట్ అంతా పక్కన పెట్టాలి. ఇక ఉదయాన్నే బ్లెండర్లో మెత్తగా పేస్ట్ చేసి పాలతో సహా కలిపి చివర్లో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి పిల్లలకు ఇవ్వాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ డ్రింక్ ఇవ్వడం వల్ల వారికి రోజు వారి శక్తిని అందించడానికి ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడ్డమే కాకుండా అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి.

వారిలో ఆలోచన శక్తి , ఏకాగ్రత పెరుగుతుంది . పిల్లలో రక్తహీనత సమస్య చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక రక్తహీనత సమస్యకు చెక్ పెట్టాలంటే ఉదయమే పిల్లలకు ఇలాంటి డ్రింక్ ఇస్తే చక్కటి ప్రయోజనాలను వారికి అందించవచ్చు. ముఖ్యంగా తరచూ పిల్లలు రోగ నిరోధక శక్తి లేక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ డ్రింక్ అందించినట్లయితే వారి శక్తి రెట్టింపు అవుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలనైనా తట్టుకునే శక్తి వారిలో కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: