
ఇకపోతే బరువు తగ్గడానికి ప్రత్యేకమైన డైట్ ప్రణాళికను అనుసరిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే బరువును తగ్గించుకోవచ్చు. ఇక బరువు తగ్గాలనుకున్నవారు ప్రతిరోజు ఉదయం పూట నిమ్మకాయ , దోసకాయతో తయారుచేసిన రసాన్ని తీసుకోవాలి. దీనిని తాగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక ఒక గ్లాసులో దోసకాయ రసం వేసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. అయితే దీనిని తీసుకున్న తర్వాత గ్రీన్ టీ కూడా తాగాలి. ఇక తర్వాత 11 గంటల సమయంలో కొద్దిగా స్పైసి టీ లేదా మసాల టీ తాగడం వల్ల సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు వారి మధ్యాహ్నం భోజనంలో క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఓట్స్ రోటీ లేదా ఓట్స్తో తయారు చేసిన వివిధ రకాల ఆహారాలను తీసుకోవచ్చు. ఇక ఇదే సమయంలో పెరుగుతో చేసిన సలాడు తప్పకుండా తీసుకోవాలి. ఇక రెండు గంటల తర్వాత కొబ్బరి నీళ్లు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా మన శరీరంలో క్యాలరీలు తగ్గిపోతాయి. ఇక రాత్రి భోజనం సమయంలో కూరగాయలతో తయారుచేసిన సూప్ తీసుకోవాలి. దీంతో పాటు బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ , నేవీ బీన్స్ కూడా ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు . అంతేకాదు శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కూడా లభ్యమవుతుంది.