తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధం అయ్యింది. పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి తాజాగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం నాడు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి డబ్బు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి ,మార్చి నెలలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.87.32 కోట్ల డబ్బులు జమ చేయనున్నారు.

ఇక క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ డబ్బును జమ చేయనున్నట్లు సమాచారం.  ఇకపోతే ఇప్పుడు అందిస్తున్న సహాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ రెండు పథకాల కింద సుమారుగా 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. ఇక ఇప్పటికే వీరి ఖాతాల్లో వైయస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లను జమ చేయడం జరిగింది. ఇకపోతే పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి అండగా నిలుస్తూ ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి వైయస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రవేశపెట్టింది.

అలాగే ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైయస్సార్ షాదీ సోఫా ద్వారా ఆర్థిక సహాయాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది.. ఇందులో భాగంగానే ఒకవైపు పేద కుటుంబాలని చెల్లెమ్మల పెళ్ళిళ్లకు అండగా నిలుస్తున్నాయి ఈ పథకాలు.. అలాగే ప్రతి చెల్లెమ్మని,  ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. బాల్య వివాహాలను నివారించడం అలాగే పేద కుటుంబాలకు చెందిన వధువుల యొక్క తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడం లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే పదవ తరగతి ఉత్తీర్ణత.. వధువుకు కనీసం 18 సంవత్సరాలు.. వరుడికి 21 సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం చేయాలి.. అలా వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: