గత కొంతకాలంగా శర్వానంద్ కు కాలం ఏమాత్రం కలిసి రావడం లేదు. కొంతకాలం క్రితం యాక్సిడెంట్ అయిన తరువాత ఆ ప్రమాదం నుండి శర్వానంద్ బయటపడినప్పటికీ అతడి సినిమాలకు మటుకు వరస పరాజయాలు దాడి చేస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సంక్రాంతి సినిమాల హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న శర్వాకు ఇప్పుడు ఆ క్రేజ్ బాగా తగ్గిపోయింది.


ఇలాంటి పరిస్థితులలో ‘శ్రీకారం’ మూవీ అతడి కెరియర్ కు చాల కీలకంగా మారింది. వాస్తవానికి ఈ మూవీకి ఇండస్ట్రీ వర్గాలలో పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఈ మూవీని టార్గెట్ చేస్తూ రెండు చిన్న సినిమాలు ‘శ్రీకారం’ మూవీతో పోటీ పడటం అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనికితోడు ‘ఉప్పెన’ మూవీ తరువాత ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ప్రేక్షకులు ధియేటర్ల వైపు చూడటం లేదు.

ఇలాంటి కన్ఫ్యూజన్ లో ‘శ్రీకారం’ విడుదల అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఆలోచింపజేసే విధంగా ఉండటంతో పాటు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడంతో ఈ మూవీ పై ఒకేసారి అందరిలోనూ ఆశక్తి పెరిగింది. దీనికితోడు ఈ మూవీకి 16 కోట్లకు పైగా బిజినెస్ జరగడంతో ఈ మూవీ నిర్మాతలు లాభాలతో బయటకు వచ్చారు.


అయితే ఈ సినిమా బయ్యర్లు సింగిల్ స్క్రీన్ కు 150 – మల్టీ ప్లెక్స్ లో 200 రూపాయలు టిక్కెట్ రేటు ఫిక్స్ చేయడంతో టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే ‘శ్రీకారం’ నిలబడగలదని లేకుంటే రెండు చిన్న సినిమాల మధ్య ఇరుక్కున్న ‘శ్రీకారం’ కలక్షన్స్ పరంగా దెబ్బతినే ఆస్కారం ఉంది అంటూ కొందరి విశ్లేషకుల భావన. ఈ అన్ సీజ‌న్లో లెక్కకు మించి అనేక సినిమాలు విడుదల అవ్వడంతో పాటు ప్రేక్షకులు ఓటీటీ లకు బాగా అలవాటుపడిన పరిస్థితులలో థియేట‌ర్లోకి వచ్చిన ప్ర‌తి సినిమాను చూడటం లేదు. దీనితో ఒక మోడరేట్ లేదా చిన్న సినిమా నిలబడగలగాలి అంటే టోటల్ పాజిటివ్ టాక్ రావలసిన పరిస్థితులు ఎదురౌతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: