సెప్టెంబర్ 5.. 2008.. ఆ రోజు నాని హీరోగా ఓ చిన్న సినిమా విడుదలైంది.అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదట. ఎందుకంటే అంత చిన్న సినిమా కనుక. కలర్స్ స్వాతి తప్ప మరో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవరున్నారో తెలియదట. కానీ విడుదలైన తర్వాత సంచలన విజయం సాధించి ఆ కుర్రాన్ని అందరికీ పరిచయం చేసిందట ఆ చిత్రం. ఆ కుర్రాడే మనం ఇప్పుడు ముద్దుగా న్యాచురల్ స్టార్ అని పిలుచుకునే నాని. ఆ సినిమానే 'అష్టాచమ్మా'.

ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంతోనే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు నాని. సరిగ్గా 13 ఏళ్ల కింద ఈ సినిమా విడుదలైందని తెలుస్తుంది . అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న నానిలో మంచి నటున్ని చూసాడు ఇంద్రగంటి. అప్పటికే శీనువైట్లతో 'ఢీ'.. బాపు 'రాధాగోపాలం' సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసాడు నాని. దర్శకత్వం కోసం కథ సిద్ధం చేసుకుంటున్న సమయమది . అలాంటి సమయంలో ఓ సినిమా ఎడిట్ సూట్‌లో ఇంద్రగంటి ఏదో పని మీద వచ్చి నానిని చూసాడట. కుర్రాడెవరో బాగున్నాడే అని తన సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వడంతో నాని దశ మారిపోయిందని తెలుస్తుంది.

అది మొదలు ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడట న్యాచురల్ స్టార్. చిరంజీవి తర్వాత ఏ అండదండలు లేకుండా ఇంత భారీ మార్కెట్ మరియు ఫ్యాన్స్ సంపాదించుకుంది రవితేజ తర్వాత నానినే అని తెలుస్తుంది. అలాంటి నాని వచ్చి అప్పుడే 13 ఏళ్లైపోయిందని సమాచారం కాలం వేగంగా వెళ్లిపోతుందంటే ఏమో అనుకున్నాం కానీ మరీ ఇంత వేగంగా వెళ్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదని తెలుస్తుంది. 'అష్టాచమ్మా' తర్వాత కూడా నానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట .

రైడ్'మరియు 'భీమిలి కబడ్డి జట్టు' లాంటి సినిమాలు పేరు తీసుకొచ్చాయట కానీ మంచి విజయం మాత్రం రాలేదట . కానీ 2011 ఈ హీరో కెరీర్‌ను మార్చేసిందని చెప్పాలి. ఆ ఏడాది 'అలా మొదలైంది'మరియు 'పిల్ల జమీందార్' విజయాలతో నాని క్రేజీ హీరో అయిపోయాడని సమాచారం. ఇక 2012లో వచ్చిన 'ఈగ' సినిమాతో నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడట నాని. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొదలైందని సమాచారం.

2012 నుంచి 2015 మధ్యలో నాని నటించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'పైసా' మరియు 'ఆహా కళ్యాణం' అలాగే 'జెండా పై కపిరాజు'.. ఇలా వరస సినిమాలయితే చేసాడు కానీ హిట్లు మాత్రం అందుకోలేదట నాని. టాలెంటెడ్ హీరోకు విజయాలు లేకుండా పోయాయే అని నాని పరిస్థితి చూసి బాధ పడిన వాళ్లు చాలా మంది వున్నారట.

అలాంటి టైమ్‌లో వచ్చిన సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'. 2015 మార్చ్ 21న విడుదలైందట ఈ చిత్రం. ఆ తర్వాత 'భలేభలే మగాడివోయ్‌'తో నాని కాస్తా న్యాచురల్ స్టార్ అయ్యాడని సమాచారం. ఈ 13 ఏళ్ళ ప్రయాణంలో 'ఎటో వెళ్లిపోయింది మనసు'కు నంది అవార్డు
మరియు 'భలేభలే మగాడివోయ్' సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడట నాని.

అప్పట్నుంచి 'కృష్ణగాడి వీర ప్రేమగాధ','జెంటిల్ మన్', 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి' మరియు 'ఎంసిఏ' సినిమాలతో వరసగా 8 విజయాలు అందుకున్నాడు నేచరల్ స్టార్. 2018లో వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' సినిమాలతో ఫ్లాపులు పలకరించిన.. 2019లో జెర్సీ సినిమాతో మరోసారి విజయం అందుకున్నాడట నాని. ఈ చిత్రంతో తాను ఎంత గొప్ప నటుడో అనే సంగతి మరోసారి నిరూపించాడట న్యాచురల్ స్టార్.

రీసెంట్ గా నాని నటించిన టక్ జగదీశ్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధంగా వుంది. మరి నానికి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.వుంది. మరి నానికి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: