
తన జీవితంలో డబ్బును ఎలా వృధా చేశారో వివరిస్తూ.. కుటుంబ ఖర్చులు, వ్యాసనాలు, మోసాలు, దానధర్మాల వల్ల చాలా డబ్బులు కోల్పోయానంటు తెలిపారు. తనకు ఎదురైన ఈ అనుభవాలే తన తప్పులను తెలిసి వచ్చేలా చేసాయని.. అత్యధిక డబ్బు సంపాదించాలనే లక్ష్యం తనకి లేదని.. ఇతర హీరోలతో పోలిస్తే తన ఆస్తి చాలా తక్కువగానే ఉందని తెలియజేశారు. తన కుటుంబానికి సరిపడే ఆస్తి సంపాదిస్తే చాలని.. ప్రస్తుతం తన కుటుంబం రూ.30 కోట్ల రూపాయలు ఉంటే జీవితకాలం జీవించవచ్చు అంటూ తెలియజేశారు. అంత డబ్బు సంపాదించిన తర్వాత అదనపు డబ్బు కోసం ప్రయత్నించాల్సిన పనిలేదంటు తెలియజేశారు.
డబ్బు కంటే జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ప్రశాంతత చాలా ముఖ్యమైనవి అంటు తెలిపారు.. అందరిలాగా తాను కూడా డబ్బు మీద ఎక్కువ మోజు పడి ఉంటే ఈపాటికి రూ 500 నుంచి రూ .700 కోట్ల ఆస్తి ఉండేది అంటూ తెలియజేశారు జగపతిబాబు. ఒకానొక సమయంలో జగపతిబాబు తన ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా తెలియజేశారు. ఎప్పుడైతే లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి పేరు సంపాదించారో అప్పటినుంచి తన కెరియర్ మారిపోయింది. అప్పటినుంచి తన డబ్బులను వృధా చేయడం మానేశానంటూ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు జగపతిబాబు.మొత్తానికి జగపతి బాబు చేసిన ఈ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.