
గతంలో సలార్, యానిమల్ సినిమాలు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాయి. అయితే వాటి బ్యాక్‌డ్రాప్ వేరే. “ఓజి” క్రేజ్ మాత్రం మాస్ నుండి క్లాస్ వరకు, సిటీ నుంచి విలేజ్ వరకు అన్ని సెగ్మెంట్స్‌కి వ్యాపించింది. ఇంతలోనే ఒక ఎన్‌ఆర్‌ఐ టీనేజర్ అమెరికా థియేటర్లలో తాను వెళ్లనివ్వాలని కోరుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈ హడావుడీని మరింత పెంచింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సమస్య పెద్దది కాదు. కానీ మల్టీప్లెక్స్ కల్చర్ ఉన్న నగరాల్లో మాత్రం తల్లిదండ్రులకు ఇది ఓ తలనొప్పే. పిల్లలు బలవంతం చేస్తే ఏదో రకంగా సింగిల్ స్క్రీన్లకు తీసుకెళ్లాల్సిందే. ఇది గత నెల రజనీకాంత్ “కూలీ”కి కూడా ఎదురైన ఇబ్బందే. యు./ఏ కోసం సన్ పిక్చర్స్ చివరికి కోర్ట్ వెళ్లినా లాభం లేకపోయింది.
అయితే ఓజి టీమ్ ఎందుకు అడల్ట్స్ ఓన్లీ తీసుకున్నారు? అన్న ప్రశ్నకి సమాధానం క్లియర్‌గా ఉంది. సెన్సార్ బోర్డు ఇచ్చిన కట్స్ లిస్ట్ దాదాపు 20కి పైగా ఉందట. అవి చేయాల్సి వస్తే సినిమాలో ఉన్న ఇంటెన్సిటీ, గ్యాంగ్‌స్టర్ డ్రామా ఫీల్ పూర్తిగా తగ్గిపోతుందని దర్శకుడు సుజిత్, పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే పెద్ద కట్స్ చేయకుండా A సర్టిఫికెట్ ఎంచుకున్నారట. ఈ సినిమాలో ఇంటిమసీ సీన్లు లేకపోయినా, వయోలెన్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ సర్టిఫికెట్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఇదే మాస్ ఫీల్ ఇస్తుందని డబుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. ఇక ఫ్యామిలీస్ మాత్రం ఎక్కడ చూడాలన్నదానిపై ఆలోచనలో పడ్డారు. ఇక సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు ఫ్యాన్స్ ఎదురుచూపులు ముగియబోతున్నాయి. నిముషాలు కూడా యుగాల్లా గడుస్తున్నాయి. పవన్ మార్క్ మాస్ రాంపేజ్ మొదలవ్వడానికి కౌంట్‌డౌన్ మొదలైపోయింది!