దేశంలో వ‌స్తు-సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) వ్యవస్థలో భారీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన ఈ జీఎస్టీ 2.0 నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని “దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం”గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రజల భారం తగ్గించాలనే సంకల్పంతోనే ఈ మార్పులు చేశామని ఆయన స్పష్టంచేశారు. అయితే, కొత్త జీఎస్టీ 2.0లో రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. కొన్ని వస్తువుల ధరలు తగ్గబోతున్నప్పటికీ, రోజువారీ జీవితంలో అవసరమైన కొన్ని ముఖ్య వస్తువులు భారీగా పెరగబోతున్నాయి. కొత్త శ్లాబులు .. పాత జీఎస్టీలో 5%, 12%, 18%, 24% శ్లాబులు ఉండగా, ఇప్పుడు 12% శ్లాబును పూర్తిగా తొలగించారు. దానిని 18% శ్లాబుతో భర్తీ చేశారు. అదనంగా కొత్త 40% శ్లాబు ప్రవేశపెట్టారు. ఇది సాధారణ ప్రజల ఖర్చుపై నేరుగా ప్రభావం చూపనుంది.

పెరగబోయే ధరలు :
40% శ్లాబులోకి వచ్చిన వస్తువులు చూసిన వెంటనే వినియోగదారులు షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు – దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, గసగసాలు, లవంగాలు, ఇంగువ, జీలకర్ర వంటి మసాలాలు. ఇవి ఇంటికి తప్పనిసరిగా కొనాల్సినవి. ఇప్పుడు 40% పన్నుతో వీటి ధరలు మరింత పెరగబోతున్నాయి. ఇదే కాకుండా, తంబాకు ఉత్పత్తులు – సిగరెట్లు, చుట్టలు, గుట్కా, వక్కపలుకులు. అలాగే మద్యం & మత్తు పానీయాలు, బ్యూటీ ప్రొడక్ట్స్ – సెంట్లు, అత్తర్లు, అలంకార వస్తువులు. ఇవన్నీ ఇంతవరకు 24% పన్నులో ఉండగా, ఇప్పుడు 40% కిందకు వచ్చాయి. ఫలితంగా వినియోగదారుల జేబులకు మరింత భారమవుతుంది.

తగ్గబోయే ధరలు .. ఇక 12% శ్లాబును రద్దు చేయడంతో కొన్ని వస్తువులు 5% లేదా 18% కేటగిరీలోకి వెళ్లనున్నాయి. దీంతో వాటి ధరలు కొంత వరకు తగ్గుతాయి. ఈ విభాగంలో ఉన్న వస్తువులు వినియోగదారులకు ఊరట కలిగిస్తాయి. మొత్తం చిత్రమేంటి? .. మొత్తం చూస్తే జీఎస్టీ 2.0 ఒకవైపు ధరల తగ్గుదలతో ఊరట ఇస్తున్నప్పటికీ, మరోవైపు తప్పనిసరి వస్తువులపై భారం పెడుతోంది. ప్రత్యేకించి మసాలాలు, బ్యూటీ ఉత్పత్తులు, తమాకు ఉత్పత్తులు వాడేవారికి ఈ పెంపు పెద్ద షాక్ అని చెప్పాలి. ప్రజలకు మిశ్రమ అనుభూతి కలిగించేలా జీఎస్టీ 2.0 మార్పులు ఉండబోతున్నాయి. ఒకవైపు ఊరట, మరోవైపు భారమని చెప్పేలా ఈ సంస్కరణలు ప్రభావం చూపనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: