రాజమౌళి నుండి సినిమా వస్తుంది అంటే అది పక్కాగా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఆ విధంగా తన కెరీర్ లో చేసిన ప్రతి ఒక్క సినిమాని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించే అలవాటు గల రాజమౌళి, తన సినిమాకి సంబందించిన ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ కారని, ముఖ్యంగా కథ, కథనాల విషయంలో ఆయన ఆలోచనలు ఎంతో పక్కాగా ఉంటాయని ఆయన తో వర్క్ చేసిన పలువురు నటీనటులు సాంకేతిక నిపుణులు చెప్తూ ఉంటారు. ఇక ప్రస్తతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ, రాజీవ్ కనకాల తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయి అందరిలో మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ సినిమాని మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో తన నెక్స్ట్ సినిమాని రాజమౌళి చేయనున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మాతగా దుర్గ ఆర్ట్స్ సంస్థపై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కథ విషయమై ఇటీవల మీడియాతో రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథకుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలను బట్టి ఈ సినిమా సౌత్ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగే భారీ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కే ఛాన్స్ ఉందని హింట్ ఇవ్వడం జరిగింది.

కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు రాజమౌళి తదుపరి సినిమా విషయమై ఆలోచించదల్చుకోలేదని, అలానే ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాత మూడు నెలల విరామం అనంతరమే రాజమౌళి, నెక్స్ట్ మహేష్ తో చేయబోయే సినిమా గురించి ఆలోచన చేస్తారని, అప్పటి వరకు ఆయన దానిని ప్రక్కన పెట్టినట్లు చెప్తున్నారు. మరోవైపు తమ హీరోతో తొలిసారిగా రాజమౌళి చేయనున్న ఈ భారీ మూవీ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్, ప్చ్ ఇంకా మా మహేష్ మూవీ కథ కూడా మొదలెట్టలేదా జక్కన్న, అసలు స్టోరీ ఎప్పుడు సెట్ అవుతుందో, ఆపైన క్యాస్టింగ్, అనంతరం షూటింగ్ ఎప్పుడు మొదలై అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో అంటూ పలువురు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్, రాజమౌళి మూవీ పక్కాగా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: