వారియర్... ఈ సినిమాలో హీరోగా మన రామ్ పోతినేని తమిళ దర్శకుడు అయిన లింగస్వామి కలయికలో ఈ సినిమా స్క్రీన్ పైకి రానుంది. ఇది ఒక కప్ యాక్షన్ స్టోరీ. ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి తెలుగు తమిళ్ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్  సరసన కస్తూరి కృతి శెట్టి నటించగా విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇదివరకు రిలీజ్ అయిన చిత్రాలు టీజర్ సింగిల్ ట్రైలర్స్ సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉండగా మాత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక మేకర్స్ మాత్రం మూడు రోజులలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని ముందుగానే జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

రామ్ గత చిత్రంలో   నేరస్తుడి పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మాత్రం ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు రామ్. ఇందులో మన హీరో పేరు ఏంటో తెలుసా డిఎస్పి సత్యా. రెడ్ సినిమా సాంగ్స్ కి కొంచెం నిరాశ కలిగించినా..... అంతకు ముందు వచ్చిన స్మార్ట్ శంకర్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. రెడ్ సినిమా కలిగించిన లోటుని ఈ ది వారియర్ చిత్రం ఫుల్ ఫిల్ చేస్తుంది అంటున్నారు మేకర్స్. ఇక దర్శకుడి విషయానికి వస్తే ఆవారా పందెంకోడి ఇలాంటి సినిమాలు తెలుగు తమిళ్ తీెసి ప్రేక్షకుల్ని అలరించారు మన దర్శకుడు లింగస్వామి. ది వారియర్ ని మాత్రం ఆసక్తికరమైన కథాకథనాలతో స్క్రీన్ పైకి తీసుకురావడం ఈ దర్శకుడు. ఈ చిత్రంపై ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో టాలీవుడ్ పాజిటివ్ బజ్ నడుస్తోంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద పెద్ద సినిమాలకు ఏ రేంజ్ లో టికెట్ రేట్ ఉందో ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో టికెట్ రేట్ ఉండేలా చూస్తున్నారు. ది వారియర్ సినిమా కోసం తెలంగాణలో మల్టీప్లెక్స్ లకు రూపాయలు 295 లు సింగిల్ స్క్రీన్స్ కు 175 రూపాయల రేటును ఫిక్స్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మల్టీప్లెక్స్ కి 177 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి 147 రూపాయలు నిర్ణయించారు. రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోలకు ఈ తరహాలో టికెట్ రేట్ ఉండడం ఒక రకంగా విశేషంగానే చెప్పుకోవాలి. కొంతకాలంగా ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి కష్టంగా ఉండటంతో ఈ తరహాలో టికెట్ రేట్స్ పెంచితే సినిమా వస్తారా అనే విషయం మాత్రం ఒక రకంగా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇప్పటి వరకు ఇలా అనుకున్న వారిని థియేటర్కి రప్పించే సత్తా ఈ ది వారియర్ సినిమా కీ ఉందని సినిమా ఇండస్ట్రీ గట్టిగానే చెబుతోంది. మరి ఈ సినిమా వారి నమ్మకాన్ని నిలబెడుతూ ఉందో లేదో మనం కూడా చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: