ఇండియన్ స్క్రీన్ మీద పోటీ పడ్డ సినిమాలు ఈ మధ్యకాలంలో మళ్లీ ఫారెన్ లో విడుదలై అక్కడ కూడా పోటీ పడేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియన్ సినిమాలు బాగా సౌత్లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సినిమాలకు మంచి మార్కెట్ ఓపెనింగ్ అవుతోంది. ఇక తమిళ్ ,తెలుగు, హిందీ వంటి భాషలలో సినిమాలు సబ్ టైటిల్ తో విదేశాలలో కూడా విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా విదేశీ భాషలలో విడుదల చేసేందుకు కొన్ని సినిమాలు మాత్రమే తీసుకుంటున్నారు అప్పట్లో బాహుబలి దంగల్ వాటి చిత్రాలు చైనా జపాన్లు విడుదల చేశారు ఇక రీసెంట్గా rrr సినిమాని కూడా జపాన్ లో విడుదల చేసి బాగానే ఆకట్టుకుంటున్నారు.

ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ వల్ల మరొక స్టార్ సినిమా కూడా జపాన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ జపాన్ లో విడుదల చేయబోతున్న సినిమా ఎంటి అంటే మాస్టర్ అన్నట్లుగా తెలుస్తోంది. విజయ్ దళపతి నటించిన ఈ సినిమాని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. విజయ్ సూపర్ హిట్ సినిమాని తెలుగులో కూడా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక ఈ సినిమాని ఇప్పుడు  జపాన్ లో విడుదల చేసి ప్లాన్లో ఉన్నారు చిత్ర బృందం. ఈ ఏడాది నవంబర్ 18న మాస్టర్ సినిమాని జపాన్ లో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం.

మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా విలన్ గా నటించారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉండడంతో ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కి కేవలం కోలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బాగానే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఆ సరే ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: