తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. వెంకటేష్ కొంతకాలం క్రితం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాతో ఒక్క సారి మళ్ళీ వెంకటేష్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. దానితో చాలా సినిమాలను ఓకే చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే సినిమాలో ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకటేష్ తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే చాలా సినిమాలకి పని చేశాడు. ఇక హరీష్ శంకర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇలా వరుస పెట్టి వెంకటేష్ , పవన్ డైరెక్టర్లను లైన్ లో పెడుతున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: