సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రియమణి , జగపతి బాబు హీరోగా తెరకెక్కిన పెళ్లయిన కొత్తలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత యమదొంగ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. యమదొంగ మూవీ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ప్రియమణి కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాష మూవీ లలో కూడా నటించి అక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రియమణి ఫుల్ యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు. చాలా తక్కువ సినిమాల్లోనే నటిస్తోంది.

తాజాగా ప్రియమణి డాక్టర్ 56 అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ మీద అందిస్తున్నారు. ప్రభుదేవా ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి మూవీ లు కూడా ఈ బ్యానర్ మీద రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా, రాజేష్‌ ఆనందలీల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా డాక్టర్ 56 మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో ప్రియమణి ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: