
ముఖ్యంగా సుకుమార్ ఈ సినిమాకు కథను అందించాడు. ఆయన శిష్యుడు కుమార్ 21ఎఫ్ సినిమా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం గమనార్హం. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని కంటెంట్ రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది.. ఈ తరుణంలోనే ఈ చిత్రం యొక్క థియేటర్ ట్రైలర్ ను 17వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఒక క్రేజీ వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు అనుపమ మరియు నిఖిల్.
నిజానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 సినిమాను థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే . ఈ సినిమాతో పాటు 18 పేజెస్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ రేపు విడుదల కాబోతుంది. ఇప్పటికే టీజరు, పాటలు, పోస్టర్లు అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్టు కొడితే ఈ జంట లక్కీ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.