
ఎట్టకేలకు ఈ సినిమాతో బాలీవుడ్ లో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. ఇక ఈమె అందచందాలతో కుర్రకారులను సైతం థియేటర్లకు రప్పించేలా చేస్తోందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు సైతం ఎవరికి వారు తమ పర్ఫామెన్స్ తో ఇరగదీసారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ మరింత పెరగడం గమనార్హం. ఈ సినిమా కలెక్షన్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి 4 ప్లస్ రేటింగ్ ఇవ్వడంతో పాటు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని మొదటి మూడు రోజుల్లో ఏకంగా ఈ సినిమా రూ.313 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏడాది ఆరంభంలోని విడుదలైన సినిమాలలో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రాల జాబితాలలో పఠాన్ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇక తర్వాత స్థానం వరిసు రూ .82 కోట్లతో నిలువగా తునీవు రూ .52 కోట్లను రాబట్టింది. ఇక తర్వాత వాల్తేర్ వీరయ్య రూ.28 కోట్ల క్రాస్ వీరసింహారెడ్డి రూ.15 కోట్ల క్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.