ప్రస్తుతం 17వ ఆసియా కప్ జరుగుతోంది. ఈసారి ఎనిమిది జట్లు బరిలోకి దిగాయి. ఫైనల్‌కు భారత్, పాకిస్థాన్ వ‌చ్చాయి. ఇందులో విశేషం లేక‌పోయినా... ట్విస్ట్ చాలానే ఉంది. భార‌త్ - పాక్ ఫ‌స్ట్ టైం ఫైన‌ల్స్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఒకే ఎడిష‌న్లో ఈ రెండు జ‌ట్లు మూడుసార్లు త‌ల‌ప‌డ‌డం కూడా ఇదే ఫ‌స్ట్ టైం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఆసియా క‌ప్ ఎడిష‌న్స్‌లోనూ 2025 ఎడిష‌న్‌లో ఇవే స్పెషాలిటీస్‌. ఫ‌స్ట్ టైం భార‌త్ - పాక్ ఫైన‌ల్స్ ఆడుతున్నాయి. ఇక ఒకే ఎడిష‌న్లో మూడుసార్లు ఆడుతున్నాయి.  ఎప్పుడో 41 ఏళ్ల కిందట 1984లో ఆసియా కప్ ఫ‌స్ట్ టైం జ‌రిగింది. అప్పుడు మూడు జ‌ట్ల‌తో స్టార్ట్ అయిన ఈ క‌ప్ ఈ ఎడిష‌న్లో ఏకంగా 8 టీంల‌కు చేరింది. ఆసియాక‌ప్ లో భార‌త్ అత్య‌ధిక‌రంగా 8 సార్లు విజేత‌గా నిలిచింది. శ్రీలంక 6 సార్లు.. పాకిస్తాన్ 2 సార్లు ఆసియా క‌ప్‌లు గెలుచుకున్నాయి.


అయితే ఇన్నిసార్లు ఆసియా క‌ప్ జ‌రిగినా ఒక్కసారి కూడా పాక్‌ మనకు టైటిల్‌ పోరులో ఎదురుకాలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇక రెండో విష‌యం ఆసియా కప్‌లో ఇప్పటివరకూ పాకిస్థాన్‌తో ఒకే ఎడిషన్‌లో భారత్ మూడు మ్యాచులు ఆడలేదు. నాలుగు సార్లు మాత్రం రెండేసి సార్లు ఆడాయి. ఇప్పుడు ఈ ఎడిష‌న్లో మాత్రం ముచ్చ‌ట‌గా మూడోసారి ఆడుతున్నాయి. ఇక గ్రూప్ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన భార‌త్ .. సూప‌ర్ స్టేజ్ మ్యాచ్‌లోనూ మ‌రోసారి ఓడించింది. ఇక ఇప్పుడు ఫైన‌ల్స్‌లో మ‌రోసారి ఆడుతోంది.


భార‌త్ - పాక్ ఫైన‌ల్‌కు ఎలా వ‌చ్చాయంటే...
గ్రూప్‌ స్టేజ్‌లో భారత్, పాకిస్థాన్‌తో పాటు యూఏఈ, ఒమన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. భార‌త్ మూడు మ్యాచ్‌లు గెలిచింది. పాక్ ఒమ‌న్‌, యూఏఈపై గెలిచి సూప‌ర్ 4కు వ‌చ్చింది. సూప‌ర్ 4లో మ‌రోసారి భార‌త్‌.. పాక్‌పై గెలిచింది. పాక్ మాత్రం బంగ్లా, శ్రీలంక‌ను ఓడిచించింది. భార‌త్ మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పుడు ఫైన‌ల్స్‌లో ఏం జ‌రుగుతుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: