ఎస్ ప్రెసెంట్, ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన  విధంగా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని అనేక వర్గాలు చెబుతున్నాయి. దానికి సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన ఇంకా వెలువడకపోయినా, సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి.  దీంతో ఫ్యాన్స్ ఈ సర్ ప్రైజ్ కోసం వెయిటింగ్. ప్రస్తుతం, “మాన్ ఆఫ్ ఎన్టీఆర్” హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కి “డ్రాగన్” అనే పేరు పెట్టారట. కానీ టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పలు ఇంటర్వ్యూలలో ఈ సినిమాలో నటించే స్టార్స్ కొన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు. ఆ టైంలో ఇది బయటపడ్డింది.


ఈ సినిమాలో, హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఆమె నటనతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ నటన కూడా ప్రేక్షకులకు ప్రత్యేక హైలెట్‌గా నిలిచే విధంగా ఉంది అంటూ మేకర్స్ చెప్పుతున్నారు. సెప్టెంబర్ 28న, కాంతారా 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబడుతుంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌లో పాల్గొని, సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియోని అభిమానుల ముందు విడుదల చేయనున్నాడట. ఇది నిజంగానే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పాలి. ఓజీ విషయంలో పవన్ కళ్యాణ్ ఇలానే చేశాడు. ట్రైలర్ పూర్తి అవ్వకుండానే రిలీ చేశారు.  అందువల్ల, సినీ ప్రేమికులు, అభిమానులు చాలా ఉత్సాహంగా ఈ మోమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.



అయితే, ఈ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ – రుక్మిణి వసంత్ ఒకే స్టేజీపై కనిపించబోతూ ఉండట, కూడా ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. “కాంతారా చాప్టర్ వన్” అక్టోబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.  ప్రేక్షకుల అంచనాలు మాత్రం ఈ సినిమా పై భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: