
అసలు విషయంలోకెళితే.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో మాస్, పల్లెటూరి పాత్రలు చేసి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్నాడు.. మరోపక్క అల్లు అర్జున్ కూడా అదే సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాలో పక్క మాస్ యాంగిల్ లో కనిపించి.. పల్లెటూరి పాత్రలోనే అలరించాడు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు హీరోలు కనిపిస్తూనే పల్లెటూరి నేపథ్యం ఉన్న కథాంశం వున్న కథలను తీసుకొస్తే.. ఖచ్చితంగా ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి అనడానికి ఈ రెండు చిత్రాలే నిదర్శనం అని చెప్పవచ్చు.
ఇప్పుడు నాచురల్ స్టార్ నాని కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ లను ఫాలో అవుతూ ఇప్పుడు తాను నటిస్తున్న దసరా సినిమాని కూడా పూర్తి మాస్ తో పాటు పక్కా పల్లెటూరు సన్నివేశాలతో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఒకవేళ ప్రేక్షకులు హీరోలను మాస్ లుక్ లో చూడడంతో పాటు పల్లెటూరు నేపథ్యంలో సాగే కథలను ఇష్టపడతారు అని ప్రూవ్ చెయ్యాలి అంటే కచ్చితంగా దసరా సినిమా సక్సెస్ కొట్టాల్సిందే . మరి నాని ఆలోచనలు సక్సెస్ అవుతాయా? తాను ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని పునరావృతం చేస్తాడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి అయితే రంగస్థలం , పుష్ప ఫీట్ లను నాని అందుకుంటాడో లేదో చూడాలి.