అజిత్-హెచ్ వినోద్-బోనీ కపూర్ వీరి ముగ్గురి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన తెగింపు సినిమా మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఆ తరువాత నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబట్టి క్లీన్ హిట్ కొట్టేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 84 కోట్లు  బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. తునివు చిత్రం  ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 96.30 కోట్ల షేర్ వసూళు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా మొత్తం రూ. 11.30 కోట్లు లాభంతో సూపర్ హిట్ గా నిలిచింది అజిత్ తెగింపు చిత్రం.తెగింపు సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 3.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 3.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అవ్వగా .. ఇక మొత్తం  ఏపీ తెలంగాణలో తెగింపు సినిమా రూ. 4.18 కోట్లు గ్రాస్ గా, రూ. 2.15 కోట్లు షేర్ నమోదైంది.


సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో  మొత్తం రూ. 2.15 కోట్లు రాబట్టింది.. మరో రూ. 1.35 కోట్లు వసూళ్లు రాబట్టగలిగితే ఇక్కడ కూడా ఈ సినిమా క్లీన్ హిట్ అయ్యుండేది.ప్రపంచవ్యాప్తంగా సాధించిన గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్లు, తమిళనాడులో రూ. 110.80 కోట్లు, కర్ణాటకలో రూ. 13.10 కోట్లు ఇంకా కేరళ రాష్ట్రంలో రూ. 3.82 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.95 కోట్లు ఇంకా ఓవర్సీస్ లో రూ. 52.60 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 186.77 కోట్లు గ్రాస్, రూ. 96.30 కోట్ల షేర్ వసూళ్లని ఈ సినిమా రాబట్టింది.అన్నీ ఏరియాల్లో కంటే కర్ణాటకలో ఈ సినిమాకి ఎక్కువ లాభాలు వచ్చాయని సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తునివు సినిమా తక్కువ బిజినెస్ జరుకొని ఫైనల్ గా సేఫ్ అయ్యి లాభాలు అందుకుందనే చెప్పాలి. అక్కడక్కడా స్వల్ప నష్టాలు వచ్చినా ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లాభాలతో క్లీన్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: