పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ ఒకవైపు భారీ సినిమాలు చేస్తూనే మరొకవైపు భారీ వ్యాపారాలలో తన పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పటికే అల్లు స్టూడియోస్ ను ప్రముఖ స్టూడియోగా మార్చడానికి వ్యూహాలు రచిస్తున్న బన్నీ హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం ధియేటర్ ను పూర్తిగా పడగొట్టి ఆస్థానంలో ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అల్లు అర్జున్ ఓనిక్స్ ధియేటర్స్ నిర్మాణం పూర్తి కావడంతో ఆధియేటర్స్ ను ఈనెలలో రాబోతున్న ‘ఉగాది’ రోజున ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి.


భాగ్యనగరంలో ఇప్పటివరకు అతి పెద్ద మల్టీ ప్లెక్స్ గా మహేష్ బాబు ఏఎంబి మాల్ కు ఒక స్థానం ఉంది. ఇప్పుడు ఆస్థానాన్ని అల్లు అర్జున్ ఓనిక్స్ భర్తీ చేయబోతోంది. ఈ మల్టీ ప్లెక్స్ లో 5 స్క్రీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇది కాకుండా ఒక పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ కూడ ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా ఓనిక్స్ స్క్రీన్ టెక్నాలజీ వాడుతున్నారు. దీని ప్రత్యేకత గురించి వివరాలలోకి వెళితే సాంప్రదాయ సినిమా ప్రదర్శనకు ఉపయోగించే ప్రొజెక్టర్ ఇందులో ఉండదు.


పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ని ఏర్పాటు చేసి దాని వెనుకే షో రన్ చేయడానికి కావాల్సిన సాంకేతికత అమురుస్తారు అని అంటున్నారు. ఇది సామ్ సంగ్ సంస్థ ప్రత్యేకంగా తీసుకొచ్చిన టెక్నాలజీ అన్న మాటలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ గా మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో చూసే సినిమా స్పష్టతకు ఈ ఓనిక్స్ ధియేటర్లలో సినిమా చూసే స్పష్టతకు చాల తేడా ఉంటుంది అని తెలుస్తోంది.


ముఖ్యంగా విజువల్ గ్రాఫిక్స్ లో ఉన్న డీటెయిల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా సినిమా చూస్తున్నంత సేపు అనిపిస్తుందట. హాలీవుడ్ మూవీస్ ను ఇలాంటి ఓనిక్స్ స్క్రీన్స్ పై చూస్తున్నప్పుడు సగటు ప్రేక్షకుడి అనుభూతి వేరు. ఈ సంవత్సరం చివరిలో రాబోతున్న ‘పుష్ప 2’ బన్నీ సొంత ధియేటర్లలోనే సందడి చేస్తుంది కాబట్టి అభిమానులకు సందడే సందడి..


మరింత సమాచారం తెలుసుకోండి: