టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన కమెడియన్ల లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఒకరని చెప్పవచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం అభిమానుల ను ఎంత గానో బాధ పెట్టిందనే సంగతి తెలిసిందే. ఆయన కొడుకు రవి బ్రహ్మతేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. నాన్న పారితోషికం విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేసేవారు కాదని రవి బ్రహ్మతేజ తెలిపారు.

నాన్న మంచితనాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది ప్రొడ్యూసర్లు రెమ్యునరేషన్ ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. అయితే నాన్నను మోసం చేసిన నిర్మాతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని నిజాయితీగా ఉండి ఉంటే ఆ నిర్మాతల జీవితాలు ఇప్పుడు మరో విధంగా ఉండేవని రవి బ్రహ్మతేజ చెప్పుకొచ్చారు. 2013 సంవత్సరంలో నాన్న మృతి చెందారని ఆ సమయంలో వేణుమాధవ్, అలీ, రాజేంద్ర ప్రసాద్, రామానాయుడు, గోపీచంద్, మరి కొందరు వచ్చారని రవి బ్రహ్మతేజ పేర్కొన్నారు.

నాన్న పార్థివ దేహాన్ని చూడటాని కి మెగా కుటుంబం నుంచి ఎవరూ రాలేదని మెగా హీరోలు రావాలని ప్రయత్నించినా వాళ్లకు వీలు కాలేదని తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. నాన్న పార్థివ దేహాన్ని ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించామ ని రవి బ్రహ్మతేజ చెప్పుకొచ్చారు. నాన్న పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు పంపలేదని ఆయన కామెంట్లు చేశారు. 2013 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాలేయ క్యాన్సర్ తో బాధ పడుతూ మృతి చెందారు.

లెక్చరర్ రోల్స్ లో ఎక్కువ గా నటించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆ పాత్రల ద్వారా ప్రశంసలు అందుకున్నారు. వివాదాలకు దూరంగా ఉన్న నటుడిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కు పేరుంది. ప్రకాశం జిల్లాలోని కొమ్మినేని వారి పాలెం ధర్మవరపు సుబ్రహ్మణ్యం స్వస్థలం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: