ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
మూవీ ద్వారా ఈ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. బిచ్చగాడు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. కాకపోతే ఏ సినిమాలు అవి కూడా బిచ్చగాడు మూవీ రేంజ్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు బిచ్చగాడు 2 మూవీ లో హీరో గా నటించాడు.

అలాగే ఈ సినిమాలో విజయ్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాను మే 19 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క "యు ఎస్ ఏ" హక్కులను ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో మే 18 వ తేదీనే ప్రీమియర్స్ వేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: