ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అనేది కేవలం రైతులకు ఆర్థిక సహాయంగా అందించడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకాన్ని 2019 నుంచి ఉత్తరప్రదేశ్లో గోరఖ్ పూర్ లో ప్రారంభించగా.. రైతులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున మూడు విడుదలుగా ఏడాదికి 6000 ఆర్థిక సహాయాన్ని అందిస్తారు ఈ సొమ్ము నేరుగా రైతుల ఖాతాలోకి జమ అవుతుందట.
ఈకేవైసీకి ఎలా అప్లై చేయాలి అంటే..
1).ముందుగా మనం అధికారికంగా వెబ్సైట్..pmkisan.nic.in వెబ్సైట్ ని సంప్రదించాలి..
2). ఫార్మర్ కార్నర్ విభాగంలో ఈ కేసి పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
3). ఓటిపి ఆధారంగా ఈ కేవైసీ ని పొందిన తర్వాత మనం ఆధార్ కార్డు నెంబర్ ని నమోదు చేయవలసి ఉంటుంది.
4). ఆ వెంటనే అక్కడ ఉన్న సెర్చింగ్ బటన్ పైన క్లిక్ చేయాలి.. ఆ వెంటనే మీ ఆధార్ కార్డు కి లింక్ అయిన నెంబర్ ని నమోదు చేసి ఓటీపి పొందడం పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
5). ఆ తర్వాత ఓటిపిని నమోదు చేసి ధృవీకరిస్తే ఈ కేవైసీ పూర్తి అవుతుంది.
ఎవరికైనా తెలియకపోతే దగ్గరలో ఉండే రైతు భరోసాలోనైనా చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి