ఉద్యోగం చేసే చాలా మంది సైతం ఏదో ఒక సందర్భంలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు.అయితే అందుకు అనుగుణంగా తమ బిజినెస్ ప్రణాళికను సైతం సిద్ధం చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజినెస్లలో ఏ బిజినెస్ అయితే శ్రమ లేకుండా రిస్క్ లేకుండా ఉంటుంది అనే అంశాలలో మార్కెట్ అనుగుణంగా క్యాష్ చేసుకోగలిగితే వ్యాపారంలో నష్టం అనేది ఉండదు.. పైగా సంపాదించుకొనే వాటిలో మరో కొంతమందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాను ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ఒకప్పుడు చాలామంది పెళ్లిళ్లకు మాత్రమే క్యాటరింగ్ ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది ఇళ్లలో జరిగేటువంటి చిన్న చిన్న ఫంక్షన్లకు క్యాటరింగ్ లను ఆశ్రయిస్తూ ఉన్నారు.. చిన్నచిన్న పట్టణాలలో ఇలాంటి క్యాటరింగ్ సేవలు ప్రారంభిస్తే మంచి డిమాండ్ ఉంటుంది. ఒకవేళ పల్లెలలో అయితే స్వయంగా ఇంట్లోనే వంటలు చేసి క్యాటరింగ్ మొదలు పెట్టడం వల్ల మరింత లాభం చేకూరుతుంది. చాలామంది ప్రజలు ఎక్కువగా ఫంక్షన్లలో రెడీ అవ్వడానికి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు.అందుకే అతనే క్యాటరింగ్ వైపుగా చాలామంది ముగ్గు చూపుతూ ఉంటారు.


ఈ బిజినెస్ను ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు చిన్న చిన్న ఫంక్షన్లకు ఆర్డర్ తీసుకుంటే మొదట ఒక రూ.10వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.. ఇందులో కూడా మొదట  క్యాటరింగ్  సేవలు అందిస్తున్న విషయం మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి తెలియజేయడానికి కాస్త ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వంటలు చేసేవారిని పెట్టుకోవడంతో పాటు క్యాటరింగ్ బాయ్స్ ని కూడా ఎంపిక చేసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు.. వంటల టెస్ట్ పనితనం మీదే ఆర్డర్స్ సైతం రాబట్టడానికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పలు మార్గాలను ఎంచుకొని పాపులర్ తెచ్చుకుంటే ఖర్చులన్నీ పోను నెలకు రూ .50 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. సొంత ఇంట్లో వంటలు చేసుకోవడం వల్ల అద్దె కూడా చెల్లించాల్సిన పని ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: