ఎవరైనా తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా.. అయితే వారి కోసమే ఒక చక్కటి బిజినెస్ ప్లాన్.. ఎవరైనా ఇంటి వద్దనే ఉంటూ మహిళలు కానీ పురుషులు కానీ చేసుకొనే బిజినెస్ లలో కారంపొడి బిజినెస్ కూడా ఒకటి.. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలి.. నెలకు ఎంత లాభం వస్తుంది.. పెట్టుబడి ఎంత అవసరం ఉంటుందనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ భారతీయ వంటకాలలో కచ్చితంగా రుచి రావాలి అంటే కారంపొడిని కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వ్యాపారానికి పోటీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.. ముందుగా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వారు రైతుల వద్ద నుంచి నాణ్యమైన ఎండు మిరపకాయలను సైతం సేకరించాలి. వాటిని ఎండబెట్టిన తర్వాత.. ఏదైనా చిన్న మిల్లు ద్వారా లేకపోతే మీ దగ్గరలో ఉండే మిక్సీ ద్వారా కారంపొడిగా తయారు చేసుకోవాలి.. ఈ కారం పొడిని 100 గ్రాముల ప్యాకెట్ నుంచి ప్యాకింగ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి.


అలా 250 గ్రాములు 500 గ్రాములు 750 గ్రాములు ఒక కేజీ ప్యాకెట్ గా సిద్ధం చేసుకోవాలి.. ఇలా చేసుకున్న తర్వాత దగ్గరలోని షాపులలో నగరాలలో వీటి ధరలను అనుసరించి పంపిణీ చేసుకోవడం వల్ల మార్కెట్లో ఉన్న ధరల ఆధారంగా చూసుకొని ఈ బిజినెస్ మొదలు పెడితే మంచి లాభాలను అందుకుంటాయి.నెలకు సుమారుగా 1000 ప్యాకెట్లు అమ్మినప్పటికీ ప్యాకెట్ మీద కనీసం 3 నుంచి 4 రూపాయలు మార్జిన్ వేసుకుంటే.. 30 రోజులలో సుమారుగా రూ .75 నుంచి లక్ష రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు.. అయితే ఇవి మనం సేల్ చేసేటటువంటి ప్యాకెట్ మీద ఆదాయం ఆధారపడుతుంది.. ముఖ్యంగా చిన్న చిన్న ₹10 ప్యాకెట్లనుంచి కూడా మొదలుపెట్టడం మంచిది డిమాండ్ ను బట్టి పెంచుకోవచ్చు. పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఖర్చు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: