తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలను కునేవారు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో మనీ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కచ్చితంగా లాభాలను సొంతం చేసుకోవచ్చు.. రిటైర్మెంట్ అయిన తర్వాత వడ్డీ ఆదాయాన్ని కావాలనుకునే వారు ఈ స్కీమ్ పైన ఎక్కువగా దృష్టి పెడితే చాలు.. 60 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ పైన బాగా దృష్టి పెట్టవచ్చు.. పదవి విరమణ తర్వాత కూడ ఎవరైనా స్థిరమైన ఆదాయాన్ని కోరుకుంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు.


సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ విధంగా ఐదేళ్లపాటు డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 7 లక్షల రూపాయలను సైతం మనం పొందవచ్చు.. రూ .5లక్షల పెట్టుబడి పెడితే 2 లక్షల రూపాయలు లాభం వస్తుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులకు సైతం..7.4 వడ్డీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ మొత్తం పొందాలనుకునే వారు ఈ స్కీం పైన దృష్టి పెడితే మంచిది..

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుందట ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ అయినవాళ్లు మరో మూడేళ్ల పాటు స్కీమును కూడా పొడిగించుకోవచ్చు.. 55 ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా పదవీ విరమణ చేసే సమయంలో ఒక నెల రోజుల్లోనే ఈ అకౌంట్ ను ఓపెన్ చేస్తే మరింత లాభాన్ని అందుకోవచ్చు.. అయితే డిఫెన్స్ లో పనిచేసే వారికి మాత్రం 50 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు ఈ స్కీమ్ పైన పూర్తి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం..

మరింత సమాచారం తెలుసుకోండి: