.మొత్తానికి ఈ చిత్రంకు ప్రమోషన్స్ లో భాగంగా ఈ మార్చ్ నేలను మ్యూజికల్ మార్చ్ గా మార్చేశారు.ఇప్పటికే ఈ సినిమా సెకండ్ సింగిల్ “సత్యమేవ జయతే”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దీనికి ముందు వచ్చిన మగువా మగువ కూడా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు హ్యాట్రిక్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టుగా సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి అంటున్నారు. హ్యాట్రిక్ లెక్కల్లో ఉంది రాస్కోరా సాంబా అంటూ పవన్ మార్క్ డైలాగ్స్ తో ట్విటర్ వేదికగా సాంగ్ పై హింటిచ్చారు రామజోగయ్య శాస్త్రి. ఈసారి మెలోడీ టచ్ తో వీరు వస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా థమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన ఈ సాంగ్ మరో వారంలో రానున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా ఏప్రెల్ 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.