ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుండి లీకైనా పోటోస్ లో పంచె కట్టులో రానా అదిరిపోయేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇక సినిమాలో రానా స్క్రీన్ ప్రెజెన్స్ తప్పకుండా గుర్తుండిపోయేలా ఉంటుందని చిత్రబృందం ధీమాగా ఉంది. సాధారణంగా పవన్ ఎదుట ఏ స్టార్ అయినా తక్కువే అనిపిస్తారు. కానీ రానా లుక్ చూసాక ఆయన కూడ స్క్రీన్ మీద మెరవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.