సినిమాల విజయంలోనూ, ప్రేక్షకులు సినిమాలను గుర్తించుకునేందుకు గాను టైటిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా టైటిల్ ను బట్టే ప్రేక్షకులు సినిమా పై ఆసక్తి కనబరుస్తారు. కొన్ని సినిమాలకు కేవలం టైటిల్ తోనే ప్రేక్షకుల్లో తార స్థాయి అంచనాలు నెలకొన్న సందర్బలు కోకొల్లలు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు టైటిల్ ఒక సినిమాకు ఎంత ప్రాముఖ్యత వహిస్తుందనేది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో నయా ట్రెండ్ నడుస్తుంది.. పాత హిట్ సినిమాల టైటిల్స్ కొత్త మూవీస్ కు పెడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్.