టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ టాప్ చైర్ కోసం పోటీ పడుతున్న వారిలో మదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ లోనూ, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగాను ఈ ఇద్దరి హీరోల మద్య తీవ్ర మైన పోటీ ఉంటుంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు ఒకే సారి తమ ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీ పడితే ఫ్యాన్స్ కు అంతకు మించిన పండుగ మేరేది ఉండది. అలాంటి రసవత్తరమైన పోరుకు 2022 నాంది పలుకానుంది.