మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే ఎవ్వరూ ఊహించని విధంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరో అనుకోని విధంగా ఉప్పెన సినిమాతో భారీ వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఔర అనిపించాడు. ఉప్పెన సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండి కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే నటన పరంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. వైష్ణవ్ డైలాగ్స్ లోనూ, ఫైట్స్ లోనూ, ఎమోషన్స్ లోనూ ఇలా అన్నిటిలోనూ పర్ఫెక్ట్ గా రాణించాడు. తాజాగా ఉప్పెన సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.